"అతడి పేపర్ నేను చివర్లో ఇస్తాను" అంటూ అతను మా ఎగ్జాం పేపర్లు ఇవ్వటం మొదలుపెట్టారు,అక్కడి 52 మంది లో ఎవరెవరి పేపర్ వస్తుందో కూడా గమనించే స్థితిలో ఎవరూ లేరు, అరె..తమ పేపర్ ఎందుకు చివర్నరాలేదే అని చిన్న నిరుత్సాహంతో అప్పటి తీసుకున్న వాళ్ళు ఆ చివరి పేపర్ ఎవరిదా అని ఎదురు చూడటం మొదలెట్టారు."
నాకు చిన్నప్పటి నుండి ఎగ్జాం అంటే పెద్ద గా భయం వుండేది కాదు,కాని నాకు ఇప్పటికి బాగా గుర్తు నేను 9వ తరగతి లో మాత్రం అది యూనిట్ టెస్ట్ గాని అవ్వచ్చు, క్వాటర్లీ లేక హాఫ్యర్లీ మాథ్స్ ఎగ్జాం ముందు రోజు మాత్రం మాత్రం మా అమ్మ తో బెల్టు దెబ్బలు మాత్రం తినే వాడిని అంటే ఇక్కడేదో ఎగ్జాం అంటే నాకు భయం కాదు, మా అమ్మ కు ఎక్కడ నాకు మార్కులు రావేమోనని. నా మొదటి పోస్ట్ లో చెప్పినట్టుగా మనం అసలే బట్టీ వీరులం, మన బట్టీ మహిమో లేక, మనం బట్టీ పట్టింది ఎక్షామ్ టైం లో బాగా గుర్తుకు రావటం వలనో మనం ఎప్పుడు క్లాసు మొదటి ఐదు ర్యాంకుల్లోనే ఉండేవాళ్ళం. నేను చదవటం కాదు కాని అదో ఏకపాత్రాభినయం లాగానే ఉండేది, మనం కొట్టేది బట్టి ఇక మెల్లగా ఎలా చదివేది, నేను చదివే చదువు అటుఇటుగా ఓ పాతిక ఇళ్ళకు వినపడేది. ఒకసారి అనుకుంటా, నా ముందు పోస్ట్ లో చెప్పా కదా గోపాల్ అనే ఫ్రెండ్ ఉండేవాడని, వాడి ఇల్లు మా ఇంటికి దాదాపుగా ఓ పది ఇళ్ళ అవతల ఉండేది, అప్పుడు నేను మరుసటి రోజు పరీక్షా మన స్టైల్లో ప్రిపేర్ అవుతుంటే, వాడేమో తీరిగ్గా వాళ్ళ ఇంటి బయట కూర్చోని ఉన్నాడు, అటువైపు వెళ్తున్న మా నాన్న ఊరుకోకుండా "ఏరా గోపి, రేపు పరీక్షా ఉందిగా అలా కూర్చున్నవేమిటి ప్రిపేర్ అవ్వకుండా" అంటే, వాడు చాల తాపీగా "లేదంకుల్, నేనూ ప్రిపేర్ అవుతున్న, అక్కడ గౌతం గాడు చదువుతున్నాడు కదా, నేను వింటూ చదువుతున్న" అన్నాడు.
కాని ఎలా చదివాం అనే దానికన్నా నా టెన్త్, ఇంటర్ లోను నాకు 75% పైనే మార్కులు వచ్చాయి. నేను డిగ్రీ వచ్చేటప్పటికి మేము హైదరాబాదుకు మొత్తం మా ఫ్యామిలీ అంత షిఫ్ట్ అయ్యాం. అప్పుడే వచ్చిన నా జ్ఞానదంతం వలనో కాని నేను పెద్దవాడిని అయ్యాను అన్ని అనుకోవటం వలనో, నా చదివే స్టైలు మారిపోయింది. అప్పటి నుండి మెల్లగా ఆన్సర్లు అర్థం చేసుకుంటూ చదివే వాడిని.
MNR కాలేజీ లో మన బి.కామ్ డిగ్రీ కాస్త ఆలస్యంగానే మొదలైంది. అసలే అది డిగ్రీ, అందులోను నేను చేరింది ఆగస్ట్ లో, సెప్టెంబర్ లో మా ఫస్ట్ యూనిట్ టెస్ట్ అన్నారు. మనకేమో ఏమి అర్థం కాలేదు. అంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి అదే మా మూడు సంవత్సరాలకు మొదటిది, చివరది కూడాను.
ఇంకా రెండు రోజుల్లో యూనిట్ టెస్ట్ అనగా, మా క్లాస్ మేట్స్ అందరూ (అంటే వాళ్ళు అప్పటికి నా ఫ్రండ్స్ కాలేదు లేండి) ఏదో దేశ సమస్యను చర్చిస్తుంటే ఇంతా అని వెల్ల, తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్ళు చర్చిస్తుంది ఏదో దేశ సమస్య కాదు, జరగాబోయే పరీక్షల్లో ఎవడు టాప్ చేస్తాడ అని. ఒక్కొకడు వాడి పేరు చెప్పకుండా, వేరే వాడి పేరు నామినేట్ చేస్తున్నారు, ఇలా అందరూ కలిసి ఓ ఇద్దరి పేర్లు డిసైడ్ చేసారు వాళ్ళే టాప్ వస్తారని, కాని నాకు ఇక్కడ ఒళ్ళు మండిన విషయం ఏమంటే, ఎంత కాలేజీకి లేట్ గా చేరితే మాత్రం ఒక్కటంటే ఒక్కడు నా పేరు నామినేట్ చేయక పొగ అస్సలు తలవనూ లేదు. ఆ క్షణం లో అనిపిచ్చింది వీళ్ళకు నేనేంటో చూపియ్యాలి అని. పరీక్షలను ఒక రేంజ్ లో రాసి పడేసాం.
ఇక మా పరీక్షా పేపర్లు ఇచ్చే రోజు వచ్చేసింది, మొదట పిరియడ్ గా మా ఎకానామిక్స్ రత్నం రాజు సర్ మా పేపర్లు పట్టుకోచ్చారు. ఆయన చాల మంచి వారు (ఎందుకంటే నేను ఆయనకు ఫేవరేట్ స్టూడెంట్ కనుక). అయన రావటం రావటం ఎంతో ఎదురు చూస్తున్న మా పేపర్లు ఇవ్వకుండా ఏదో మాట్లాడటం మొదలెట్టారు, "ఇక్కడ మీరందరు మీ ఇంటర్ లో CEC చేసి వచ్సిన్తారు, అందుకే మీకు ఈ పరీక్షా పెద్ద కష్టం అనిపివ్వకపోవచ్చు, కాని ఇక్కడ ఒక స్టూడెంట్ ఇంటర్ లో MPC చేసాడు, మన కాలేజీకి కూడా చాల లేట్ గా జాయిన్ అయ్యాడు కాని అతను మీ అందరికన్నా ఎక్కువ మార్కులతో టాప్ చేసాడు, అతడి పేపర్ మాత్రం నేను చివర్న ఇస్తాను" అంటూ మా పేపర్లు ఇవ్వటం మొదలెట్టారు. ఒకోక్కడి పేరు చదవటం వాడు తన పేరు చివర్న రాలేదే అని కాస్త నిరుత్సాహంతో తన పేపర్ తీసుకుంటున్నాడు. ఇక చివరి పేపర్ వచ్చింది, క్లాస్ మొత్తం నిశబ్దం ఎవరిదా పేపర్ అని. సర్ పిలిచినా పేరుకు అందరూ ఆశ్చర్యంగా చూసారు, అసలు ఆ పేరు వున్నా వారు తమ క్లాస్ లో ఎవరా అని. లాస్ట్ బెంచ్ నుండి, మెల్లగా అందరి ఆశ్చర్యాల మధ్య నుండి వచ్చి పేపర్ అందుకున్న నాది. నన్ను చూసిన ఒక్క నిముషం ఒక్క సారిగా నిశబ్ధం అసలు ఎవరా నేనని.
అప్పుడు ఆ క్షణంలో ప్రపంచాన్ని జయించిన alexander లా ఫీల్ అవుతూ వెళ్లి నా సీట్ లో కూర్చున్నా.