మాట తడబడుతుంది, కాళ్ళల్లో వణుకు మొదలైంది, ఎదురుగా అసలు ఎవరు వున్నారో కూడా కనపడటం లేదు, ఏమి మాట్లాడుతున్న, ఏమి మాట్లాడాలి ఏమి అర్థం కావటం లేదు, దాదాపు నా పరిస్థితిని చూసి అందరూ నవ్వటం కూడా మొదలెట్టారు. అసలు ఆ రోజు నేను మాట్లాడటానికే ఎందుకలా భయపడ్డా ...?
అప్పుడు నేను 8 వ తరగతి చదువుతున్న రోజుల్లో. స్కూల్లో మన మీద తెలుగు సబ్జెక్టుల్లో ఒక రేంజ్ లో పేరు వుండేది లేండి తెలుగు టీచర్ నుండి ప్రినిసిపాల్ వరకు. మీరు కాస్త ఆశ్చర్యంగా అనుకోవచ్చు "తెలుగు సబ్జెక్టుల్లో వీడికి మంచి పేరు వుండటం" ఏంటి అని, నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం కదా, మా ఫ్రండ్స్ కైతే తెలుగు చదవటానికి అంతగా వచ్చేది కాదు, మనకేమో పద్యాలు అవి ఇవి ఒక రెంజులో వచ్చేవి. ఆ మాత్రం చాలదూ మనకు పేరు రావటానికి.
ఒక రోజు తెలుగు పీరియడ్ టైంలో ఆయా ఏదో సర్కులర్ పట్టుకొచ్చింది. మేము అందరం చూస్తున్నాం సెలవు దేనికి ఇస్తున్నార అని, (అంటే దాదాపు గా హాలిడే సర్కులర్స్ అన్ని ఆయా నే కదా తెచ్చేది), తీరా అది హాలిడే సర్కులర్ కాదని ఏదో eluctution competetions కి సంబందించినది అని తెలిసి కాస్త నిరుత్శాహం కూడా పడ్డాం. నేను దాన్ని లైట్ తీసుకొని క్లాసు అయ్యిన తరువాత ఇంటర్వల్ కి వెళ్తుంటే , మా తెలుగు టీచర్ పిలిచి " గౌతం దీంట్లో నువ్వెందుకు పాల్గోనరాదు, కావాలంటే నేనే నీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తా వెళ్లి ట్రై చెయ్" అని కాస్త separate క్లాసు లో నాకొక్కడికే చెప్పెలోకే ఇక చూసుకోండి మన పరిస్థితి , అబ్భో కాళ్ళు నేల మీద ఉంటేనే కదా. టాపిక్ "జన్మభూమి" ప్రోగ్రాం మీద, పాపం మా టీచరే ఓ రెండు పేజీల నోట్స్ తాయారు చేసి ఒక రోజు ముందే ఇచ్చింది. అసలే మనం బట్టి కింగ్ ముందు రాత్రి కూర్చొని నిద్ర లో కూడా లేపి అడిగితే చెప్పేల మొత్త్తం బట్టిపెట్టేసాం.
తరువాతి రోజు మా క్లాసు నుండి నేను ఒక్కడిని , ఇక మా సీనియర్స్ అంతా ఓ పది మంది కలిసి ఆ పోటీలు జరిగే Ideal పబ్లిక్ స్కూల్ వెళ్ళాం. తీర అక్కడికి వెళ్ళాక చూస్తే దాదాపు ఒక వందకు పైనే స్టూడెంట్స్ సిటీ లోని అన్ని స్కూళ్ళ నుండి వచ్చారు. ఎక్కడో చిన్న భయం మొదలైంది. కలక్టర్ , D E O , ఆ స్కూల్ ప్రిన్సిపాల్ , వాళ్ళు వీళ్ళు అంటూ దాదాపు పది మంది పైనే ఉన్నారు గేస్ట్లు . వాళ్ళేదో అది ఇది మాట్లాడిన తరువాత పోటీలు స్టార్ట్ అయ్యాయి. ఓ అయిదారు మంది తరువాత ఒక అమ్మాయి , ఆ తరువాత మనమే. ఆ అమ్మాయి ఛాన్స్ వచ్చింది దడ దడమని మెషీన్ గన్ లోని బుల్లెట్ల మాట్లాడి నాకు ఛాన్స్ ఇచ్చింది. మన ఛాన్స్ వచ్చిందిగా మా టీచర్ బెస్ట్ అఫ్ లక్ చెప్పించుకొని స్టేజి ఎక్కాం ఏదో వీరుడిలా , అదేనండి బట్టి వీరుడిలా.
ఇక చూసుకోండి మన పరిస్థితి , నేనూ తక్కువ తిన్నాన మొదలెట్టా మొదటి నిముషంలో దడ దడ అని స్టార్ట్ చేసాం, కాని ఎవడో వాడు ఎక్కడి నుండి వచ్చాడో గాని నా కొంప ముంచాడు, నేను చెప్పేది ఏదో సిలంట్ గ వినవచ్చు కదా ఎందుకు నవ్వాడో తెలియదు కాని నన్ను చూసి కిసుక్కని నవ్వాడు అంతే నా గన్ లోని బుల్లెట్ల ఫ్లో , నా మాట రెండూ ఆగి పోయాయి, ఒక్కసారిగా ఆగిపోయా, అంత బట్టిపట్టిందంతా మర్చి పోయా, కాళ్ళు వణికి పోతున్నాయ్, అందరూ నా వణుకుడిని చూసి నవ్వటం మొదలెట్టారు, నాకు ఏమి కనపడటం లేదు, అంతే ఒక్కసారిగా, ఎటు పరిగెత్తానో కూడా తెలియకుండా....!!!!
ఆ ప్రోగ్రాం అయ్యిన తరువాత ఆప్పుడు నవ్వినా నా శత్రువు కనపడితే కోపంగా దేనికి నవ్వావని అడిగా, అప్పుడు మళ్ళి నవ్వుతూ నా ప్యాంటు జిప్ వైపు చూపాడు...."అప్పుడు అర్థం అయ్యింది అప్పటికి కూడా నేను ప్యాంటు జిప్ వేసుకోలేదని".
No comments:
Post a Comment